Republic | తెలుగమ్మాయి అయినా కూడా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేశ్ ( aishwarya rajesh )కు చాలా కాలం పట్టింది. నిజానికి ఈమె తెలుగమ్మాయి అని చాలా మందికి తెలియదు. పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోనే కావడంతో ఆమెను ఎవరూ తెలుగమ్మాయి అని అనుకోరు. ఐశ్వర్య రాజేశ్ తండ్రి కూడా నటుడే. ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఈమె. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో సొంతంగా ఎదగడానికి చాలా కష్టపడింది ఐశ్వర్య రాజేశ్. తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది. మంచి పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి తెలుగులో గుర్తింపు సంపాదించుకుంది ఐశ్వర్య రాజేశ్. సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో ఆమె పోషించిన సువర్ణ పాత్ర ఆడియన్స్ కు బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. తాజాగా ఈమె నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను దేవా కట్టా తెరకెక్కించాడు. ఇందులో ఐశ్వర్య ఎంచుకున్న పాత్ర అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ ఉండి కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా కథకు ప్రాధాన్యం ఇచ్చి ఈ పాత్ర చేసింది.
ఇందులో ఈమె క్యారెక్టర్ ను క్రూరంగా మానభంగం చేస్తారు. ఇలాంటి పాత్ర చేయడానికి సాధారణంగా హీరోయిన్లు ముందుకు రారు. తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో అని భయపడుతుంటారు. కానీ ఐశ్వర్య రాజేశ్ మాత్రం డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలోనూ స్టార్ అవ్వాలని చూస్తోంది. మరి ఈమె ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గ్లామర్ పాత్రలు చేయను! : ఐశ్వర్య రాజేశ్
Aishwarya Rajesh | ఐశ్వర్య రాజేశ్ బ్యూటిఫుల్ ఫొటోస్
నల్లగా ఉండే వాళ్లు సినిమాల్లో నటించలేరా?
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!