మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ ఇప్పటికీ అబ్బాయిల కలల రాణి అని చెప్పక తప్పదు. 47 ఏళ్ల వయస్సులోను తన అందచందాలతో ఐష్ ఎంతగానో అలరిస్తుంది. ఈ అమ్మడిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది భామలు హీరోయిన్స్‌గా ఇండస్ట్రీకి ఇచ్చారు. ఐష్ పోలికలు ఉండడంతో స్నేహా ఉల్లాల్‌కి కూడా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. ఇప్పుడు మరో బ్యూటీ ఐష్ మాదిరిగా ఉండడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.
ఆశిత రాథోడ్ అనే మహిళ అచ్చం ఐశ్వర్యరాయ్ మాదిరిగా ఉండడంతో దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ సాంగ్స్, డైలాగ్స్ వీడియోలను చేస్తూ.. సాంప్రదాయ వస్త్రధారణతో మూవీ డైలాగ్స్ చెబుతూ అందుకు సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఆశితకు ఇన్‌స్టాలో 26 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రీసెంట్గా షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ నటించిన దేవదాస్ చిత్రంలోని సిసిలా యే చాహత్ కా పాటకు తన హవాభావాలు కలిపి వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలను చూసిన నెటిజన్స్ అరె.. అచ్చం ఐష్లానే ఉంది కదా, ఈవిడకి సినిమా ఆఫర్స్ తప్పక వస్తాయని కామెంట్స్ పెడుతున్నారు. మరాఠీ నటి మాన్సి నాయక్.. పాక్ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్ లు కూడా ఐష్ పోలికలతో ఉండడంతో పాపులర్ అయ్యారు.