IIFA 2024 | ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబిలో అంగరంగా వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులను ప్రకటించగా.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏఆర్ రెహమన్, మణిరత్నం, ఐశ్వర్యారాయ్, విక్రమ్ తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు.
అయితే పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును బాలకృష్ణ చేతుల మీదుగా అందుకుంది ఈ భామ. అయితే ఈ అవార్డును అందుకోవడానికి వేదిక పైకి వెళ్లిన ఐశ్వర్యారాయ్ బాలకృష్ణ కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Mega Superstar and Mindblowing Actress #AishwaryaRai #AishwaryaRaiBachchan G.O.A.T. ❤️🙇♂️👑🗺️🇮🇳🙏 wins #IIFAIUtsavam2024 Performance in a Leading Role (Female) award 4 her outstanding performance in #PS2. She accepts the award from Nandamuri Balakrishna.
– https://t.co/TasyY5juUO pic.twitter.com/W0CHLf0FIT— Aishwarya Rai Adorer Arijit Bhattacharya (@Aishusforever) September 28, 2024