Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ టాలెంటెడ్ యాక్టర్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి కింగ్ ఆఫ్ కోట (King Of Kotha) . అభిలాష్ జోషి డైరెక్షన్లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు టీజర్ (King Of Kotha teaser) నెట్టింట హల్ చల్చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇవాళ ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్టు ఓ వార్త బయటకు రాగా.. ఐశ్వర్య లక్ష్మి స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆగస్టు 25న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
కింగ్ ఆఫ్ కోటలో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఓనమ్ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
కింగ్ ఆఫ్ కోట టీజర్..