యాక్షన్‌కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన లవ్‌స్టోరీగా ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. అర్జున్ పవర్ఫుల్ ఎంట్రీతో సర్ప్రైజ్ చేశారు.
విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫీల్‌గుడ్ రొమాంటిక్ స్టోరీ ఇదని, కథ, కథనాలు కొత్తగా ఉంటాయని మేకర్స్ తెలిపారు. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు: అర్జున్.