Aishwarya Arjun | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) ఇంట పెండ్లి సందడి నెలకొంది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) నేషనల్ అవార్డ్ విన్నర్, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో ఉమాపతి రామయ్య (Umapathy Ramaiah) వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని గెరుగంబాక్కమ్లో అర్జున్ కట్టించిన హనుమాన్ ఆలయంలో ఈ పెండ్లి వేడుక జరిగింది.
బంధుమిత్రులు, సన్నిహితులు, ఇండస్ట్రీ స్నేహితుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్- ఉమాపతి రామయ్య ఏడడుగులు వేశారు. సముద్రఖని, విశాల్ తండ్రి జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్, నటుడు విజయ కుమార్‌తోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చెన్నైలోని పాపులర్ ఫైవ్‌స్టార్ హోటల్లో రిసెప్షన్ జరుగనుంది. ఐశ్వర్య అర్జున్ వెడ్డింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఐశ్వర్య అర్జున్ సిల్వర్ స్క్కీన్‌పై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా అర్జున్ తెలుగు సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని అర్జున్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Happy Married Life 💐 #UmapathyRamaiah ❤️ #AishwaryaArjun pic.twitter.com/YLXZyAUwqH
— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 11, 2024
ఐశ్వర్య అర్జున్-ఉమాపతి రామయ్య వెడ్డింగ్ ఫొటోలు..
Actor & director #ThambiRamaiah’s son #UmapathyRamaiah & #Arjun’s daughter #AishwaryaArjun @aishwarya got married yesterday pic.twitter.com/8Vlv5nlfTE
— sridevi sreedhar (@sridevisreedhar) June 11, 2024
Happy Married Life 💐 #UmapathyRamaiah ❤️ #AishwaryaArjun pic.twitter.com/0Ga9R2l7s1
— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 11, 2024