Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. ఘటనపై పలువురు సినీతారలు విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదలో చనిపోయిన వారి కుటుంబీకుల దుఃఖాన్ని ఊహించడం కష్టమని.. అందరికీ తట్టుకునే బలాన్ని, ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పరిణీతి పేర్కొంది. జాన్వీ కపూర్ సైతం విచారం వ్యక్తం చేసింది.
అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందనే వార్త విని తాను షాక్కు గురయ్యాయని పేర్కొంది. ఇలాంటి విషాదాల బాధను మాటల్లో వ్యక్తపరచడం అసాధ్యమని.. ప్రయాణీకులు, సిబ్బంది.. బాధిత ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నట్లు జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన ముంబయిలో నిర్వహించాల్సిన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. సల్మాన్ ముంబయిలోని ఓ హోటల్ జరిగే మీడియా కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న సీనియర్ నటుడు తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో సంబరాలు చేసుకోవడం ఎంత మాత్రం సరికాదని.. విమాన ప్రమాదం తీవ్రమైందని.. దేశవ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారన్నారు. గురువారం మధ్యాహ్నం సల్మాన్ ఓ హోటల్లో ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) మీడియా కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరు కావాల్సి ఉంది.
Shocked and speechless at the Air India crash. Only prayers at this time 🙏
— Akshay Kumar (@akshaykumar) June 12, 2025
ఈ ఘటనపై బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ సైతం స్పందించారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాద వార్త విని నేను షాక్ అయ్యానని.. ప్రమాదంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు శాంతించాలన్నారు. ఈ ఘటనపై హీరోయిన్ శోభితా ధూలిపాళ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని.. బాధితుల కుటుంబాలు, సిబ్బంది కోసం ప్రార్థిస్తున్నానని.. ఈ క్లిష్ట సమయంలో అందరి కోసం ప్రార్థించాలన్నారు. బాలీవుడ్ నటి సారా అలీఖాన్, అక్షయ్ కుమార్, సోనూసూద్, రితేశ్ దేశ్ముఖ్తో పాటు మరికొందరు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Absolutely heartbroken and in shock after hearing about the tragic plane crash in Ahmedabad. My heart goes out to all the passengers, their families, and everyone affected on the ground. Holding them all in my thoughts and prayers during this incredibly difficult time.
— Riteish Deshmukh (@Riteishd) June 12, 2025
Devastated by the news of the plane crash in Ahmedabad.
Praying with all my heart for survivors — may they be found and receive the care they need.
May those who lost their lives rest in peace, and may their families find strength in this unimaginable time. 🙏— Sunny Deol (@iamsunnydeol) June 12, 2025