‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వల్ల సినీ పరిశ్రమ పరిధి విస్త్రృతమవుతోంది. రానున్న ఐదేళ్లలో చిత్రసీమ పదిరెట్లు అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు అల్లు అరవింద్. ప్రియదర్శి, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ (ఐఎన్జీ). సురేష్‌కృష్ణ (‘బాషా’ ఫేమ్) నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకుడు. ‘ఆహా’ ఓటీటీ ద్వారా త్వరలో ఈ వెబ్‌సిరీస్ విడుదలకానుంది. ఈ సిరీస్ ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్‌ను మంగళవారం విడుదలచేశారు. తాను నిర్మించిన తొలి వెబ్‌సిరీస్ ఇదని, క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఆసక్తికరంగా సాగుతుందని సురేష్‌కృష్ణ తెలిపారు. సామాన్యుడిగా అవతారం ఎత్తిన దేవుడికి నేటి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే ఈ సిరీస్ ఇతివృత్తమని దర్శకుడు చెప్పారు. మంచితనాన్ని వీడిన ఓ సామాన్య వ్యక్తి రౌడీగా ఎలా మారాడన్న అంశాన్ని కొత్త పంథాలో ఆవిష్కరించే కథాంశమిదని ప్రియదర్శి చెప్పారు.