ప్రేక్షకులకు అవసరమైన అన్ని రకాల వినోదాన్ని అందించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది తెలుగు డిజిటల్ ప్లాట్ఫాం ఆహా (Aha). తెలుగు సినిమాలతోపాటు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఇతర భాషా చిత్రాలను కూడా డబ్ చేసి.. మన ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సెలబ్రిటీ టాక్ షోతో కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. కాగా ఇపుడు ఆహాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మూడు అప్కమింగ్ తెలుగు సినిమాలే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా దక్కించుకుంది. వీటిలో ఒకటి సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తోన్న మైఖేల్. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyamu Vishnu Katha) రైట్స్ కూడా దక్కించుకుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్గా నటిస్తోంది.
దీంతోపాటు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తోన్న కళ్యాణం కమనీయం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా సొంతం చేసుకుంది. జనవరి-ఫిబ్రవరి మధ్యలో ఈ మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. రానున్న రోజుల్లో ఈ మూడు సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ పై ఆహా క్లారిటీ ఇవ్వనుంది.