AGS Entertainments – Pushpa | దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి 2 చిత్రం యొక్క తమిళం రికార్డులను అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం బ్రేక్ చేస్తుందని తమిళ డిస్ట్రిబ్యూటర్ ఏజీఎస్ బ్యానర్ నుంచి వచ్చిన మాలి నవీన్ వెల్లడించాడు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు పుష్ప 2 టీమ్ భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ ప్రెస్ మీట్లో తమిళ డిస్ట్రిబ్యూటర్ మాలి నవీన్ మాట్లాడుతూ.. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు ధన్యావాదాలు. పుష్ప అనేది జస్ట్ బ్రాండ్ కాదు. ఇది నేషనల్ బ్రాండ్. మూవీపై తమిళనాడులో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో డే1 రోజున దళపతి విజయ్, అజిత్, రజనీకాంత్‌ల తర్వాత ఎవరికి డబుల్ డిజిట్ కలెక్షన్లు లేవు. కానీ పుష్ప సినిమాతో అల్లు అర్జును ఈ రికార్డును క్రియేట్ చేసేలా ఉన్నాడు. మేము రీసెంట్గా తమిళంలో విజయ్ గోట్ సినిమాను 530 లోకేషన్స్‌లో 803 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు పుష్పను కూడా అదే రేంజ్లో విడుదల చేయబోతున్నాం. ఇప్పటివరకు తమిళంలో బాహుబలి 2 రికార్డు ఉంది. ఈ చిత్రం అక్కడ రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ రికార్డును పుష్ప 2 అవలీలగా బ్రేక్ చేస్తుంది అంటూ మాలి నవీన్ వెల్లడించాడు.