జీవా, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సినిమాలో ‘గాలి ఊయలలో..’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని సోమవారం విడుదల చేశారు. యువన్‌శంకర్ ఈ పాటను స్వరపరిచారు.
ఇళయరాజా సిగ్నేచర్ పియానో పీస్తో ప్రారంభమైన ఈ పాట సోల్‌ఫుల్ మెలోడీగా మెప్పిస్తుందని, యువన్‌శంకర్ కంపోజ్ చేసిన మెలోడీ పాటలన్నింటిలో ఉత్తమంగా నిలుస్తుందని దర్శకుడు పా. విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తాను ఇప్పటివరకు ఎన్నో మెలోడీ పాటలకు బాణీ కట్టానని, అన్నింటిలో ఈ పాట చాలా ప్రత్యేకమని స్వరకర్త యువన్‌శంకర్ రాజా పేర్కొన్నారు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజువల్స్ అబ్బురపరుస్తాయని, వెండితెరపై సరికొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతికిలోనవుతారని మేకర్స్ తెలిపారు.