Agent | టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) త్వరలోనే ఏజెంట్ (Agent)గా సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్నాడు. ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అఖిల్ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో.. సినిమా ప్రమోషన్స్ కోసం అదే స్థాయిలో కష్టపడుతున్నాడు.
తాజాగా అఖిల్ విజయవాడకు వెళ్లాడు. విజయవాడలోని పీవీవీ థియేటర్ బిల్డింగ్‌పై నుంచి రిస్కీ జంప్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. అఖిల్ రిస్కీ స్టంట్‌ను మూవీ లవర్స్ తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఏప్రిల్ 18న రాత్రి 7:30 గంటలకు ట్రైలర్ లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు. కాకినాడలోని ఎంసీ లారిన్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ జరుగనుంది.
ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా పరిచయమవుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.
THE WILDEST POSTER of #AGENT is here 😎#AgentTrailer on APRIL 18th @ 𝟕:𝟑𝟎 𝐏𝐌🔥
Grand Launch at MC Laurin High School Grounds, Kakinada💥#AGENTonApril28th @AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @laharimusic pic.twitter.com/BaHEP4fMOn
— AK Entertainments (@AKentsOfficial) April 16, 2023
Wild saale ‘s Wildest stunt and Poster !🔥 Let’s Jathin mingify…💥💥💥 #AGENT #AkhilAkkineni pic.twitter.com/5b1GYB9yDv
— Karthikk.7✨ (@Karthikk_7) April 16, 2023
A Never Before WILD FEAT by the WILD ONE @AkhilAkkineni8 🔥
Unveiled the #AGENT WILD POSTER to Announce the Trailer Time by LANDING from 172 feet HIGH 😎
– https://t.co/TrTqwfjtzJ#AGENTonApril28th @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @shreyasgroup pic.twitter.com/4UQspNOe9Y
— AK Entertainments (@AKentsOfficial) April 16, 2023
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..