Agent Movie Release Date | ఈ మధ్య కాలంలో ‘ఏజెంట్’ సినిమా వాయిదా పడినన్ని సార్లు ఏ సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదు. రేపో మాపో విడుదలవుతుందని అనుకునే సమయంలో పోస్ట్ పోన్ అంటూ అక్కినేని అభిమానుల ఆశలపై నీళ్లుచల్లుతూ వచ్చారు. గతేడాది అగస్టులో ఖచ్చితంగా వస్తుందంటూ మేకర్స్ ప్రకటించినా.. వారం రోజులు ఉందనగా పోస్ట్‌పోన్ అయింది. ఇక క్రిస్మస్కి వస్తుందంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏవేవో కారణాలు చెప్పి మళ్లీ వాయిదా వేసారు. ఇక అన్ని కుదిరితే సంక్రాంతికి పక్కా వస్తుందంటూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తీరా సంక్రాంతి వచ్చే సరికి సైలెంట్ అయిపోయారు.
దాంతో సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ కావాలంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా మూవీ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అఖిల్ మొహం నిండా రక్తంతో కోపంత రగిలిపోతున్నట్లు ఉన్నాడు. ఈ ఒక్క పోస్టర్ సినిమా క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ కథలతో దగ్గరైన అఖిల్.. మాస్ యాక్షన్ సినిమా చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో పోస్టర్‌తో మేకర్స్ ఓ డెమో ఇచ్చారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
గతకొంత కాలంగా అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ సినిమా అఖిల్‌కు కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో ఏజెంట్ కోసం చేతులు కలిపాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడ లేని బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ కమర్షియల్ హిట్టును సాధిస్తాడో లేదో చూడాలి.
The #WildSaala is set to take you all on a wild ride in theatres 🤙#AGENT WorldWide Release on 28th April 2023🔥
– https://t.co/IHpWdERoyd#AgentonAPRIL28th 💥💥@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic pic.twitter.com/1cNZzr8NKV
— AK Entertainments (@AKentsOfficial) February 4, 2023