Satluj OTT | ఏండ్ల నిరీక్షణకు తెర.. థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద పంజాబీ చిత్రం ‘సత్లుజ్’
DiljitDosanjh | చాలా కాలంగా సెన్సార్షిప్ వివాదాలు, ఆలస్యాల నడుమ నలిగిపోయిన బాలీవుడ్, పంజాబీ స్టార్ హీరో దిల్జీత్ దోసాంజ్ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది.
Diljit Dosanjh | చాలా కాలంగా సెన్సార్షిప్ వివాదాలు, ఆలస్యాల నడుమ నలిగిపోయిన బాలీవుడ్, పంజాబీ స్టార్ హీరో దిల్జీత్ దోసాంజ్ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. అయితే, థియేటర్ల విడుదల కోసం గతంలో ‘పంజాబ్ ’95’ (Punjab ’95) గా ప్రకటించిన ఈ సినిమా పేరును డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ‘సత్లుజ్’ (Satluj) గా మార్చారు. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1990ల కాలంలో పంజాబ్‌లో జరిగిన తీవ్రవాద అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలు, అదృశ్యాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సున్నితమైన కథాంశం కారణంగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాపై అనేక ఆంక్షలు విధించింది. దాదాపు డజన్ల కొద్దీ కట్స్ మరియు మార్పులు సూచించడంతో సినిమా విడుదల సంవత్సరాల తరబడి నిలిచిపోయింది.
అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో చిత్రబృందం థియేట్రికల్ విడుదలను పక్కనబెట్టి, నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్‌ను పంజాబ్‌లోని ప్రసిద్ధ నది పేరు అయిన ‘సత్లుజ్’గా మార్చి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్ర పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

