Tarakaratna | తారకరత్నను ఆస్పత్రిలో చూశా.. 100 శాతం రికవరీ అవుతాడు : మంచు మనోజ్
Tarakaratna | నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నాడని అటు నందమూరి బాలకృష్ణ.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలియజేశారు.
Tarakaratna | గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవుతున్నాడని అటు నందమూరి బాలకృష్ణ.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలియజేశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి ఫ్యామిలీని పరామర్శించిన మంచు మనోజ్ కూడా ఇప్పుడు ఇదే చెబుతున్నాడు. తొందరలోనే రికవరీ అయి మన ముందుకు వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో తారకరత్న ఆరోగ్యంపై నిన్నటి దాకా టెన్షన్ పడ్డ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లిన మంచు మనోజ్.. ఐసీయూలో ఉన్న తారకరత్నను చూశారు. అనంతరం నందమూరి ఫ్యామిలీని పరామర్శించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నను చూశానని రికవరీ అవుతున్నాడని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తారకరత్నను చూస్తున్నానని.. మొదట్నుంచి అతను చాలా స్ట్రాంగ్ పర్సన్ అని తెలిపాడు. తొందరలోనే రికవరీ అయి మన ముందుకొస్తాడని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో ఏదో ఒక కష్టం వస్తుంటుంది అని.. తారకరత్నకు ఇది టెస్టింగ్ టైమ్ అని అభిప్రాయపడ్డాడు.తారకరత్న కోలుకుని, తిరిగివస్తాడని 100 శాతం నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వైద్యులు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్లో కూడా ఒక పోస్టు చేశాడు.
visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I’m sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023
Read More :
Jamuna Biopic | మిల్క్ బ్యూటీ తమన్నాకు బంపర్ ఆఫర్.. జమున బయోపిక్‌లో నటించే ఛాన్స్?
Mandeep Roy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

