Divyansha Kaushik | నాగ చైతన్య రెండో పెళ్లిపై ఇప్పుడు రోజుకో వార్త పుట్టుకొస్తుంది. మొన్నటివరకు శోభితా దూళిపాళ్లతో చైతూ డేటింగ్లో ఉన్నాడని వార్తలు వినిపించాయి. తొందరలోనే వీళ్లిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలు నిజమో.. వట్టి వదంతులో తెలిసేలోపే మరో న్యూస్ ఫిలింవర్గాల్లో వైరల్‌గా మారింది. మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తో చైతూ పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.
నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మజిలీ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో రామారావు ఆన్ డ్యూటీలో దివ్యాంశకు ఆఫర్ కూడా ఇప్పించాడని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు జోరందుకున్నాయి. దీంతో నటి దివ్యాంశ కౌశిక్ స్పందించింది.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యాంశ మాట్లాడుతూ.. నాగచైతన్య అంటే తనకు ఇష్టమని.. ఐ లవ్ చైతూ అని చెప్పింది. అతడు చూడటానికి బాగుంటాడని తెలిపింది. చైతూపై తనకు క్రష్ కూడా ఉందని పేర్కొంది. అయితే తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఆఫర్ రావడానికి నాగచైతన్యనే కారణమని వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించింది.
“Divyansha Kaushik | మైఖేల్ మూవీ ప్రెస్ మీట్లో దివ్యాంశ కౌశిక్..”