దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఛావా’ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో అద్భుతమైన విలనీ పండించి ప్రేక్షకుల్ని మెప్పించారు సీనియర్ నటుడు అక్షయ్ఖన్నా. తాజాగా ఆయన తెలుగు సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించే ‘మహాకాళి’ సినిమాలో అక్షయ్ఖన్నా కీలక పాత్రను పోషించబోతున్నారు. భారతీయ పౌరాణిక ఇతివృత్తాలను సూపర్‌హీరో కథలతో మేళవించి దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా రాబోతున్న మూడో చిత్రమే ‘మహాకాళి’. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: ఆర్కేడీ స్టూడియోస్, షోరన్నర్: ప్రశాంత్‌వర్మ.