ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పి.రవిశంకర్ స్వీయ దర్శకత్వంలో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘సుబ్రహ్మణ్య’. తిరుమల్‌రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలు. ఈ సినిమా 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
కన్నడ అగ్రహీరో డా.శివరాజ్‌కుమార్ లాంచ్ చేసిన ఈ పోస్టర్లో హీరో అద్వయ్‌ని ‘సుబ్రహ్మణ్య’గా పరిచయం చేశారు. పొడవాటి జుత్తు, గడ్డం, ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్ర్తాలతో అద్వయ్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని రెడ్‌చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి.
ముంబై, హైదరాబాద్, బెంగళూర్, చెన్నైకి చెందిన ప్రముఖ స్డూడియోలలో వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: విఘ్నేష్ రాజ్, సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ప్రవీణ కడియాల, రామలక్ష్మి, నిర్మాణం: ఎస్జీ మూవీ క్రియేషన్స్.