Major Movie Collections | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘మేజర్’ హవానే నడుస్తుంది. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై సంచలన విజయం సాధించింది. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ జీవించాడు. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. శేష్ గత చిత్రానికి వచ్చిన మొదటి రోజు కలెక్షన్ల కంటే ఐదు రేట్లు అధికంగా ఈ సినిమాకు వచ్చాయి. రెండవ రోజు కూడా మేజర్ చిత్రం అదే జోరు చూపించింది.
నైజాం : 3.37 కోట్లు
సీడెడ్ : 0.87 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.98 కోట్లు
ఈస్ట్ : 0.65 కోట్లు
వెస్ట్ : 0.44 కోట్లు
గుంటూరు : 0.52 కోట్లు
కృష్ణా : 0.50 కోట్లు
నెల్లూరు : 0.35 కోట్లు
ఏపీ+తెలంగాణ : 7.68 కోట్లు(12.90 కోట్ల గ్రాస్)
హిందీ+రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.05 కోట్లు
ఓవర్సీస్ : 4.20 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) : 13.48 కోట్లు(24.50 కోట్ల గ్రాస్)
‘మేజర్’ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ కావాలంటే రూ.15 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఈ చిత్రం రెండు రోజులకు రూ.13.48 కోట్ల షేర్‌ను, రూ.24.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి అడివి శేష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా మేజర్ నిలిచింది. అడివి గత చిత్రం ఫుల్ రన్ కలెక్షన్లను మేజర్ రెండు రోజుల్లోనే సాధించింది. ఆదివారం కలెక్షన్లతో మేజర్ చిత్రం బ్రేక్‌ఈవెన్‌ను పూర్తి చేసుకుని లాభాల బాట పట్టనుంది.