అడివి శేష్ ‘గూఢచారి’ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు కావొస్తున్నది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి 2’(G2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య ఇంతటి సుదీర్ఘమైన గ్యాప్ రావడం ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అడివి శేష్‌కి పెరిగిన పానిండియా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని, అన్ని భాషల్లోనూ అంతర్జాతీయ స్పై యాక్షన్ అనుభూతిని ఇవ్వాలనే కసితో.. స్క్రిప్ట్ విషయంలో గానీ, ప్రీ ప్రొడక్షన్ విషయంలో కానీ మేకర్స్ ఎక్కువ సమయం తీసుకున్నట్టు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ‘గూఢచారి 2’ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా భారీ కాస్టింగ్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. వినయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, వామిక గబ్బి కథానాయిక పాత్ర పోషిస్తున్నది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానున్నదని సమాచారం.