Major Unnikrishnan | టాలీవుడ్ నటుడు అడివి శేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన దేశం గర్వించదగ్గ సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబాన్ని తాజాగా అడివి శేష్ కలుసుకున్నాడు. ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మేజర్’. ఈ సినిమాలో ఉన్ని పాత్రలో అడివి శేష్ నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా వచ్చి 3 ఏండ్లు గడవడమే కాకుండా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమరులైన నవంబర్ 26 నాడు, ఆయన తల్లిదండ్రులను కలిసి తన అనుబంధాన్ని చాటుకున్నారు అడివి శేష్.
ప్రతి సంవత్సరం నవంబర్ 26న మేజర్ కుటుంబాన్ని కలిసి వారితో గడపడం అడివి శేష్‌కు అలవాటుగా మారింది. ఈ సందర్భంగా, శేష్ ముందుగా ముంబైలోని మేజర్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులు అయిన ధనలక్ష్మి ఉన్నికృష్ణన్, శ్రీ ఉన్నికృష్ణన్లని కలిసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ‘మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు గడిచినా, ఈ సినిమా బృందానికి, ఉన్నికృష్ణన్ కుటుంబానికి మధ్య ఏర్పడిన అనుబంధం మరింత బలపడుతోంది. మేజర్ గారి తల్లిదండ్రులు చూపే స్ఫూర్తి తనకు ఎంతో గొప్పదని శేష్ తెలిపారు.
I’m happy we smiled together for a bit.
Love you both Uncle & Amma ❤️At the 26/11 Memorial
We shall #NeverEver Forget. #MajorSandeepUnnikrishnan #JaiHind 🇮🇳 pic.twitter.com/ZtjeQaqqIy— Adivi Sesh (@AdiviSesh) November 27, 2025