యంగ్ సెన్సేషన్ అడివి శేష్ కొద్ది రోజుల క్రితం డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇటీవల ఆయన తిరిగి రావడంతో ‘ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా పూర్తి విశ్రాంతి తీసుకుంటున్న అడివి శేష్ వర్కవుట్స్ మొదలు పెట్టాడు.
తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి బయటకు రాగా, ఇందులో అడివి శేష్ బాగా కుస్తీలు పడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అడివి శేషు మేజర్ అనే సినిమా చేస్తుండగా, టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్.. ఏ ప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు.. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హిట్ సిక్వెల్లోనూ అడివి శేషు నటిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Guess who’s back 💯
— Adivi Sesh (@AdiviSesh) October 21, 2021
Getting back into shape for #MajorTheFilm #FinalShoot pic.twitter.com/mezDC4Ml5P