Hit-2 Movie First Day Collections | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ‘మేజర్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అదే జోష్‌లో తాజాగా ఈయన నటించిన ‘హిట్-2’ రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో విశ్వక్ హీరోగా నటించగా.. రెండవ పార్టులో అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించాడు. రిలీజ్‌కు ముందు మేకర్స్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా అంతే భారీ స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టింది.
హిట్-2 మూవీ మొదటి రోజు రూ.11.27 కోట్ల గ్రాస్‌ను, రూ.6.43 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. అడివి శేష్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా హిట్-2 నిలిచింది. ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.8.57 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందని పులువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మిస్తున్నారు. ఇక మూడో పార్ట్‌లో నాని కథానాయకుడిగా నటించనున్నాడు.