Adivi Sesh | ‘గూఢచారి’ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న అడివిశేషు.. ‘మేజర్’తో మేజర్ హిట్ కైవసం చేసుకొని స్టార్ హీరోల్లో ఒకడిగా అవతరించారు. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి-2’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘గూఢచారి 1’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు వందకోట్ల బడ్జెట్ కేటాయించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వారు తెలిపారు.
ఇమ్రాన్ ఇమేజ్ పాన్ఇండియా మార్కెట్‌కి కలిసొస్తుందని చిత్రయూనిట్ గట్టిగా నమ్ముతున్నది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు.