Dacoit | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి డెకాయిట్ (Dacoit). షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా తీసుకోగా.. ఈ భామను ఆ తర్వాత రీప్లేస్ చేసిన విషయం తెలిసిందే. అయితే మృణాల్ ఠాకూర్‌ను ఫీ మేల్ లీడ్ రోల్లో తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
అడివిశేష్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 11:30 గంటలకు డెకాయిట్‌లో హీరో ప్రేయసి ఎవరో చెప్పబోతున్నట్టు తెలియజేశారు. కళ్లు చూస్తుంటే మృణాల్ ఠాకూరేనని క్లారిటీ వచ్చేస్తుంది. దీనిపై రేపు స్పష్టత రానుంది. చాలా రోజుల క్రితమే డెకాయిట్ టైటిల్ టీజర్ విడుదల చేయగా.. మాజీ ప్రేమికుల శత్రుత్వంతో సినిమా కొత్త పంథాలో సాగబోతుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్. హీరోయిన్ రీప్లేస్ నేపథ్యంలో మరోసారి టైటిల్ టీజర్ విడుదల చేస్తారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
అడివి శేష్ మరోవైపు ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
On the occasion of @AdiviSesh‘s birthday, introducing his beloved (or maybe not) one ❤️🔥
Tomorrow at 11.30 AM. Stay tuned 💥#DACOIT @Deonidas #BheemsCeciroleo @danushbhaskar @abburiravi @srinagendrapd @KalyanKodati #SupriyaYarlagadda @AsianSuniel @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/AddumJFZXs
— BA Raju’s Team (@baraju_SuperHit) December 16, 2024
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!