టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషించిన గూడఛారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంఛైజీలో ఇపుడు జీ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ముంబైలో జరిగిన ఈవెంట్లో జీ2 (G2) ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియోను షేర్ చేశారు మేకర్స్.
అడివి శేష్ స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతుంది.రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షూట్ కానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా జీ2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మేజర్ సినిమా ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
లాంఛింగ్ ఈవెంట్లో అభిషేక్ అగర్వాల్, అడివి శేష్, వినయ్ కుమార్ పాల్గొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.
G2 ప్రీ వెర్షన్ లుక్ వీడియో..
#G2 Pre Vision 💥
▶️ https://t.co/0aHvhvFnV0Shoot commences soon.
In Telugu, Hindi, Tamil, Kannada and Malayalam. @AdiviSesh @vinaykumar7121 @AbhishekOfficl @peoplemediafcy @AKentsOfficial @MayankOfficl pic.twitter.com/EnTnAUGPtn
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) January 9, 2023