ఆదిత్య శశికుమార్, చాందిని తమిళరసన్, లావణ్య సాహుకార జంటగా నటిస్తున్న చిత్రం ‘సమిధ’. సతీష్ మాలెంపాటి దర్శకుడు. అరుణం ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 14న విడుదలకానుంది. రాజస్థాన్లో జరిగిన ఓ యథార్థ కథను స్ఫూర్తిగా తీసుకొని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించామని, ఆద్యంతం అనూహ్య మలుపులు, యాక్షన్ హంగులతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
ఈ థ్రిల్లర్ కథలో చక్కటి ప్రేమకథ కూడా ఉంటుందని హీరో ఆదిత్య శశికుమార్ తెలిపారు. రవికాలే, కృష్ణమురళి, శ్రవణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.విజయశ్రీ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ మాలెంపాటి.