ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో రూపొందిన పర్యావరణ నేపథ్య థ్రిల్లర్ ‘బంధీ’. రఘు తిరుమల దర్శకుడు. గల్లీ సినిమా బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబడింది. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడ్డ ఈ చిత్రానికి అనేక ప్రశంసలు కూడా దక్కాయని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో ఆదిత్యఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు ప్రశంసనీయంగా ఉంటుందని, మనదేశంతోపాటు ఇతర దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో కూడా రియల్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించామని, పర్యావరణ ప్రేమికుల్ని కదిలించేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.