Aditi Shankar | తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గారలపట్టి అదితి శంకర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే తమిళంలో విరుమన్, మావీరన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా తెలుగు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరవం. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తుండగా.. మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లరి నరేష్‌కి నాంది లాంటి సూపర్ హిట్ చిత్రంను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కే.కే రాధమోహన్ నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల ఫస్ట్ లుక్‌లను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా అదితి శంకర్ ఫస్ట్‌లుక్‌ను వదిలారు. పాలడబ్బాలను బండి మీద పెట్టుకుని వెళుతున్న అల్లరి పిల్ల వెన్నెలాగా ఈ చిత్రంలో కనిపించబోతుంది అదితి. ఇక తమిళంలో ఘన విజయం సాధించిన ‘గరుడన్’ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తుంది. స్నేహం, నమ్మక ద్రోహం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది.
Introducing the beautiful @AditiShankarOfl 👑 as the 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐏𝐢𝐥𝐥𝐚 ‘Vennela’ from the intense world of #Bhairavam 🔱
She will capture your hearts like never before ❤️@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat… pic.twitter.com/tiv72pFBQB
— Vijay Kanakamedala (@DirVijayK) November 14, 2024