గురువారం 04 జూన్ 2020
Cinema - May 11, 2020 , 09:49:16

పురాత‌న యుద్ధ‌క‌ళ‌పై ప‌ట్టుసారిస్తున్న అదితిరావు

పురాత‌న యుద్ధ‌క‌ళ‌పై ప‌ట్టుసారిస్తున్న అదితిరావు

ఎప్పుడు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీ సెల‌బ్రిటీస్‌కి లాక్‌డౌన్ స‌మ‌యం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కొంద‌రు యాక్టింగ్ కోర్సులు ఆన్‌లైన్‌లో నేర్చుకుంటుండ‌గా, మ‌రి కొంద‌రు వేరే విద్య‌లు అభ్య‌సిస్తున్నారు. తాజాగా స‌మ్మోహ‌నం బ్యూటీ అదితిరావు హైద‌రి క‌ల‌రిప‌య‌ట్టు అనే మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఇది పురాత‌న యుద్ధ క‌ళ‌లలో ఒక‌టి.

కేర‌ళ రాష్ట్రానికి చెందిన క‌ల‌రిప‌య‌ట్టు అనే యుద్ధ విద్య‌ని  అదితి ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటుందో అని అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అదితి మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఈ సినిమా పురాత‌న క‌థ ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమా కోసమే అమ్మ‌డు క‌ష్ట‌ప‌డుతుంద‌ని స‌మాచారం. చివ‌రిగా తెలుగులో వి అనే చిత్రంలో న‌టించిన హైద‌రి  ఇటీవలే సైకో సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రీసెంట్ గా మూడు మలయాళం సినిమాలను లైన్ లో పెట్టింది. మొత్తానికి రానున్న రోజుల‌లో అదితి దశ తిరిగినట్టే అని ఫ్యాన్స్ చెబుతున్నారు.logo