Aditi Rao Hydari | నటి అదితి రావు హైదరీ సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలు దేశీయ, పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అదితి, పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, తాజాగా వాట్సాప్‌లో తన ఫోటోలను ఉపయోగిస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారని వెల్లడించారు. అదితి షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో, ఒక వ్యక్తి ఆమె పేరు, ఫోటోలను ఉపయోగిస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోటోషూట్ల పేరుతో మెసేజులు పంపుతున్నట్లు కనిపించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో క్లారిటీ ఇస్తూ అభిమానులను అప్రమత్తం చేశారు.
ఈ రోజు కొంతమంది నాకు చెప్పిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. వాట్సాప్‌లో నా ఫోటోలను ఉపయోగిస్తూ ఎవరో ‘ఫోటోషూట్’ కోసం మెసేజులు పంపుతున్నారు. అవి నేను పంపినవి కావు. నేను ఎప్పుడూ నా పర్సనల్ నంబర్‌ను వర్క్ కోసం ఉపయోగించను. నా అధికారిక పనులు అన్నీ నా టీమ్ ద్వారానే జరుగుతాయి. అలాంటి మెసేజులు వస్తే వెంటనే నా arhconnect టీమ్‌కి తెలియజేయండి. నాకు ఎప్పుడూ అండగా నిలిచే అభిమానులకు ధన్యవాదాలు,” అని అదితి పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇటీవల పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతో మోసాలకు గురవుతున్న సందర్భంలో, ఇప్పుడు అదితి పేరు, ఫోటోలతో కూడా మోసగాళ్లు దోపిడీకి ప్రయత్నాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఇలాంటి నకిలీ మెసేజులను నమ్మవద్దని ఆమె స్పష్టం చేశారు. ఇక అదితి రావు హైదరి కొద్ది రోజు క్రితం సిద్ధార్థ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితంతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతుంది. అదితి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కాక రేపుతూ ఉంటుంది.