Writer Manoj | రిలీజ్‌కు ముందు ఎలాంటి నెగెటివిటీ ఎదుర్కుందో.. రిలీజయ్యాక అంత కంటే ఎక్కువే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఆదిపురుష్ సినిమా. అసలు ఇది రామాయణం ఇతిహాసమేనా, గొప్ప కథను చెత్తగా చూపించారు. సైఫ్ స్పైక్‌ను తీసేయలేదు. పైగా ఒకటీ రెండు సీన్లలో తప్పితే బ్రహ్మణుడు అయిన రావణుడు బొట్టు పెట్టుకున్న దాఖలాలే కనిపించలేదు. ఇంద్రజిత్ ఒంటి నిండా పచ్చ బొట్లేంటి? ఏ రామాయణ కథలో రావణాసురుడి పది తలలు పైన కింద ఉంటాయని చెప్పారని విమర్శలు. ఇక స్వర్ణలంక అనే గొప్ప పేరున్న లంకను చీకటి మోడ్‌లో చూపించడంపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమాను మొదటి నుంచి రామాయణ కథగానే మేకర్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ట్రైలర్లు, పాటలు సైతం ఇది రామాయణం కథ అనే స్పష్టం చేశాయి. అయితే తాజాగా ఆదిపురుష్ రచయితల్లో ఒకరైన మనోజ్ ముంతాషిర్ శుక్లా ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో ఈ సినిమా రామాయణం కథ కాదనే విధంగా మాట్లాడాడు. సినిమా రిలీజైన దగ్గర నుంచి ఆదిపురుష్ మూవీలో అనేక సన్నివేశాలు, పాత్రలపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ఒక టీవీ చానెల్ చర్చలో యాంకర్ ప్రస్తావిస్తే, మనోజ్ దానిపై స్పందిస్తూ.. తాము రామాయణం నుంచి చాలా వరకు స్ఫూర్తి పొందిన మాట వాస్తవమే అయినా.. తాము తీసింది మాత్రం రామాయణ కథను కాదని.. ఇది కల్పిత కథ అన్నట్లుగా మాట్లాడాడు.
దీనిపై పలువురు నెటిజన్లు చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ముందు నుంచి ఈ సినిమాను రామయణం అంటూ ప్రచారం చేసి ఇప్పుడు కల్పిత కథ అంటూ ప్లేటు మార్చడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. రామాయణం అంటూ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి ఇప్పుడు కాదంటే దానిలో ఆర్థమేంటి అని నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. ఇక సినిమాపై వస్తున్న విమర్శలు పక్కన పెట్టేస్తే కలెక్షన్లు మాత్రం కనీవిని ఎరుగని రీతిలో వస్తున్నాయి. తొలిరోజే నూటా నలభై కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించి సంచలనం సృ ష్టించింది. రెండో రోజు కూడా వంద కోట్ల రేంజ్లో కలెక్షన్లు నమోదయ్యాయని ఇన్సైడ్ టాక్.