Adipurush Teaser Time | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ఆదిపురుష్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన టీజర్ పోస్టర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. కాగా ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న టీజర్ రోజు రానే వచ్చింది. ఆది పురుష్ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ను ఆయోధ్యలో గ్రాండ్‌గా జరుపుతున్నారు. ఇప్పటికే చిత్రబృందం అయోధ్యలో లాండ్ అయింది.
కాగా ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆదివారం రాత్రి 7.11 నిమిషాలకు విడుదల చేయనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
Read Also:
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో?
బాక్సాఫీస్ దగ్గర ‘పొన్నియన్ సెల్వన్’ ప్రభంజనం.. తమిళ సినీ చరిత్రలోనే మొదటిసారి..!
Pridhvi Raj | పృథ్విరాజ్‌కు షాకిచ్చిన ఫ్యామిలీ కోర్టు.. భరణంగా నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలంటూ తీర్పు