Adipurush Movie Run Time | మరో నాలుగు వారాల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకు ఆది నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. గతేడాది రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ఏకంగా ఆరునెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం మరో వంద కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల రిలీజైన ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇన్ని రోజులు ఈ సినిమాపై వచ్చిన నెగెటివిటీ అంతా ఒక్క ట్రైలర్‌తో పటాపంచలయింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. దానికి తోడు మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ అంతకంతకూ అంచనాలు పెంచుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్ లాక్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా రన్‌టైమ్ 2గంటల 54 నిమిషాలు ఉండనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రన్టైమ్తో సినిమాలే రాలేవు. దాదాపు 3 గంటల రన్టైమ్తో విడుదవుతున్న ఈ సినిమాలో ఎలాంటి అంశాలను చూపిస్తారో అని అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక జూన్ 13న ఈ సినిమాను ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితం చేయనున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు జూన్ 15కు పోస్ట్ పోన్ చేశారు.