ప్రభాస్ కథానాయకుడిగా భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న
చిత్రం ‘ఆదిపురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతిసనన్
నటిస్తున్నది. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. అక్షయ తృతీయ
సందర్భంగా ఈ సినిమాలోని లిరికల్ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. అజయ్-అతుల్ స్వరపరచిన ఈ
గీతాన్ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ‘నీ సాయానికి సదా
మేమున్నాం. సదా సిద్ధం సర్వసైన్యం. సహచరులై పదా వస్తున్నాం. సఫలం స్వామికార్యం’ అంటూ
సకలగుణాభిరాముడి ధీరత్వాన్ని చాటుతూ ఈ పాట సాగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త
పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు.