Adipurush Movie | ‘అదిపురుష్’ టీజర్ ఏ ముహూర్తానా రిలీజ్ చేసారో కానీ, అప్పటి నుండి సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతేడాది దసరా కానుకగా రిలీజైన టీజర్‌పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారని, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని పలు విధాలుగా విమర్శలు చేశారు. అంతేకాకుండా సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు దాఖలైంది. ఇన్నీ విమర్శల మధ్య ఆది పురుష్ బృందం సంక్రాంతి రిలీజ్‌కు వెనక్కు తగ్గి వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం ఏకంగా ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ప్రస్తుతం ఆదిపురుష్ బృందం మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం కష్టపడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా నుండి మరో టీజర్ రాబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా రెండో టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటువ్వకుండా అందరనీ ఆకట్టుకునే విధంగా టీజర్‌ను కట్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేం ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. కాగా ఇప్పుడు వీఎఫ్ఎక్స్ కోసం మరో వంద కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.