Adipurush First Look Poster Update | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి రెండు వరుస ఫ్లాప్‌లు వచ్చిన ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇప్పటివరకు రాలేదు. దాంతో మేకర్స్‌పై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ఫస్ట్‌లుక్ పోస్టర్.. సెప్టెంబర్ చివరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా డిజైన్ చేసినట్లు టాక్. దీనిపై చిత్రయూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఓం రౌత్.. రామాయణం నేపథ్యంలో రూపొందించాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 20 భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా మేకర్స్ రూపొందిస్తున్నారట.