ముంబై: రామాయణం ఇతివృత్తంగా ప్రభాస్, క్రితి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. గ్లోబల్‌గా, దేశీయంగా కలెక్షన్ల వర్షం కురిసింది. హిందీ వెర్షన్లో తొలిరోజు కలెక్షన్ల పరంగా చూస్తే బ్రహ్మాస్త్రను ఆదిపురుష్ దాటేసింది. అయితే షారూఖ్‌ఖాన్ ‘పఠాన్’, యశ్ ‘KGF 2’ సినిమాల కంటే వెనుకబడింది.
ఆదిపురుష్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.140 కోట్ల కలెక్షన్లు వసూలైనట్టు వివిధ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం భారత్‌లోనే రూ.95 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ట్రేడ్ నిపుణుడు రమేశ్ బాల ప్రకారం కేవలం హిందీ వెర్షన్లో ఆదిపురుష్ తొలిరోజు రూ.40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంటే బ్రహ్మాస్త్ర సినిమా హిందీ వెర్షన్‌కు వచ్చిన రూ.36 కోట్ల తొలిరోజు కలెక్షన్లను ఆదిపురుష్ బీట్ చేసింది.
అయితే, షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా హిందీ వెర్షన్ తొలిరోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా యశ్ నటించిన KGF 2 సినిమా రూ.54 కోట్లు రాబట్టింది. వాటితో పోల్చుకుంటే ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు కలెక్షన్లు కొంచెం వెనుకబడ్డాయి.