మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం మంచు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘1974-90 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.
ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి పాత్ర సరికొత్త పంథాలో ఉంటుంది’ అన్నారు. ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజితఘోష్, శివ కంఠమనేని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణం: అన్వికా ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: సంజీవ్ మేగోటి.