ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ నెల 28న విడుదలకానుంది. నైజాంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తున్నది. శనివారం నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమా తీశారని, శబ్దం ఒక ఆయుధం అనే అంశాన్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారని, హారర్ సినిమా చూసి కళ్లలో నీళ్లు తిరుగుతాయని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ఎమోషన్స్‌తో కూడిన హారర్ మూవీ ఇదని, తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆది పినిశెట్టి తెలిపారు. సౌండ్‌ని హారర్ థీమ్‌గా తీసుకొని ఈ సినిమా చేశామని దర్శకుడు అరివళగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.