త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ కాండ్రేగుల నిర్మాత. ఇటీవలే టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రస్తుతం భార్యలు.. భర్తల్ని చంపిన ఉదంతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే తరహా కాన్సెప్ట్‌తో ఈ కథ నడుస్తుంది. క్షణికావేశంలో చేసే ఒక్క నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందనే అంశాన్ని ఈ సినిమాలో చూపించాం. ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత గోవిందు కాండ్రేగుల పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, సంభాషణలు: వై.అమ్మిరాజు, రచన-దర్శకత్వం: కొండల్.