అగ్ర కథానాయకుడు వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెం: 47’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు వెంకటేష్, శ్రీనిధి వారి కుటుంబంతో కలిసి ఆనందంగా కనిపిస్తున్నారు. వినోదం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాల కలబోతగా రూపొందిస్తున్న సకుటుంబ కథా చిత్రమిదని, త్రివిక్రమ్ శైలి హాస్యం, అర్థవంతమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి కెమెరా: రవి కె చంద్రన్, సంగీతం: తమన్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.