కరోనా సెకండ్ వేవ్‌తో చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం.
తాజాగా హ్యాపీడేస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణకు కరోనా షాక్ తగిలింది. ఇటీవలే ఆదర్శ్‌తోపాటు అతని కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆస్పత్రిలో చేరారు. ఆదర్శ్ ట్రీట్మెంట్ లో ఉండగా..ఓ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో తాను అందుబాటులో ఉండనని తన టీంకు చెప్పాడు ఆదర్శ్.
అయితే సదరు చిత్రయూనిట్ ఎలాంటి సమాచారం లేకుండా ఆదర్శ్‌ను సినిమా నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు ఆదర్శ్. నటుడి జీవితం అభద్రతకు మించినదేమి కాదు. సినిమా నుంచి తనను తీసేశారని బాధేమి లేదని, కాని ఓ మెసేజ్ అయినా పెట్టి సమాచారం ఇచ్చి ఉంటే మంచి వీడ్కోలు అయి ఉండేదన్నాడు ఆదర్శ్.
Whole family tested +ve for Covid a few days ago. Parents in hospital. Informed my film crew about the same. Was replaced in a jiffy without any intimation whatsoever. The insecurities an actor lives through are beyond measure. But hey, such is life. #COVID19India #covidlesssons
— Aadarsh Balakrishna (@AadarshBKrishna) April 16, 2021