Adah Sharma | ‘నిర్మాణ రంగ కార్మికురాలిగా సుత్తితో గోడలను పగలగొట్టడంలో శారీరక శిక్షణ తీసుకున్నాను’ అని చెప్తున్నది అందాల తార అదా శర్మ. నటుడు సునీల్ గ్రోవర్తో కలిసి ‘సన్‌ఫ్లవర్-2’ వెబ్‌సిరీస్‌లో కనిపించనున్నది. ఈ సిరీస్ నుంచి ఆమె ఫస్ట్‌లుక్ శనివారం విడుదలైంది. 2021లో సునీల్ గ్రోవర్ నటించిన ‘సన్‌ఫ్లవర్’ ఓటీటీ వేదికగా ప్రేక్షకాదరణ పొందడంతో ఈ సిరీస్ సీక్వెల్‌గా వస్తున్న ‘సన్‌ఫ్లవర్-2’ జీ5 ద్వారా త్వరలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో అదాశర్మ బార్ డ్యాన్సర్‌గా నటించనున్నది.
ఫస్ట్‌లుక్ పోస్టర్లో అదాశర్మ చీరలో రాజ్ అని రాసి ఉన్న టెడ్డీబేర్ పట్టుకొని చురుకైన చూపులతో అందంగా కనిపిస్తున్నది. ‘డోంట్ క్రాస్ క్రైమ్ సీన్’ అని రాసి ఉన్న బారికేడ్ టేపుల ముందు నిలబడి ఉంది. అదాశర్మ సామాజిక మాధ్యమాల్లోనూ ఆసక్తిని రేకెత్తించే పదాలు జోడించి ఫస్ట్‌లుక్‌ను పోస్ట్ చేసింది. ఈ సిరీస్‌లో తన పాత్ర గురించి, ఈ పాత్ర కోసం తాను ప్రిపేర్ అయిన తీరు గురించి చెప్పింది అదాశర్మ. ‘ఒక విచిత్రమైన అమ్మాయి రోజీగా నటించాను. ఈ పాత్ర కోసం సుత్తితో గోడలను పగలగొట్టడం నేర్చుకునేందుకు భవన నిర్మాణ రంగ కార్మికురాలిగా శారీరక శిక్షణ తీసుకున్నాను’ అని పేర్కొంది. ఈ సిరీస్‌లో సునీల్ గ్రోవర్.. సోనుసింగ్ పాత్రలో నటిస్తుండగా, మిస్టర్ అహుజాగా ముకుల్ చద్దా, దిలీప్ అయ్యర్‌గా ఆశిష్ విద్యార్థి, ఇన్స్పెక్టర్ దిగేంద్రగా రణవీర్ షోరే, ఇన్స్పెక్టర్ తాంబేగా గిరీష్ కులకర్ణి నటించారు.