అందమైన డ్యాన్సులతో పాటు అదరిపోయే ఫైట్సూ చేయగలదు ఆదా శర్మ. ‘1920’, ‘హసీ తో ఫసీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ‘హార్ట్ ఎటాక్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’ సినిమాలతో తెలుగులోనూ సుపరిచితమే. ‘కమాండో’ సిరీస్ సినిమాల్లో పోలీస్‌గా ఆకట్టుకునే యాక్షన్ చేసిన ఈ భామ..ప్రస్తుతం మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నది. ‘పడావ్’ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రాన్ని గాంధర్ ఫిల్స్ అండ్ స్టూడియో నిర్మిస్తుండగా…విశాల్ పాండ్య దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదా శర్మ స్పంది స్తూ…‘ఇన్నాళ్లుగా కెరీర్లో నేను వేచి చూసిన సమయం వచ్చింది. సినిమాను నడిపించగల కీలక పాత్రలకు నన్ను సంప్రదిస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన గుర్తింపు అనుకుంటా. నాయికలే ముందుండి నడిపించిన చిత్రాలెన్నో ఉన్నాయి. నాకూ అలాంటి అవకాశాలు వస్తున్నాయి. మరిన్ని ఆసక్తికర చిత్రాల వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అని చెప్పింది.