Vincy aloshious | ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు సెట్స్‌లో తమకి ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. హీరోలు లేదంటే దర్శక నిర్మాతలు తమని ఎంత ఇబ్బందులు పెట్టారనేది మీడియా ముందుకు వచ్చి నిర్భయంగా చెబుతున్నారు. దాంతో ఆ విషయాలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. హీరోయిన్గా ఎదగాలి అంటే ఎన్నో అవరోధాలను దాటాల్సి ఉంటుంది. వాటన్నింటిని దాటి స్టార్ హీరోయిన్స్‌గా కొందరు ఓ వెలుగు వెలుగుతుంటే మరి కొందరు మాత్రం ఆ బాధలు తట్టుకోలేక ఇండస్ట్రీ నుండే బయటకి వెళ్లారు. అయితే తాజాగా ఓ మలయాళ నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టి వార్తలలో నిలిచింది. మరి ఆ మలయాళ నటి మరెవరో కాదు విన్సీ సోనీ అలోషియస్.
2019 లో విన్సీ సోనీ మళయాల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రేఖ అనే మూవీతో కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆమె నటించిన జనగణన చిత్రం అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా ఆమె ఓ సినిమా సెట్ లో హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ తీసుకొని వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొంది విన్సీ సోనీ అలోషియస్. ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని తాను ఎన్నో ఇబ్బందులు అనుభవించినట్టు పేర్కొంది.. ఓ సారి అయితే తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని కూడా తెలియజేసింది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫిమేల్ ఆర్టిస్టులు వేధింపులకు గురౌతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది . ఇప్పటికి కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుని మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్నారని నటి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎదురైన వేధింపుల ఘటన అందరికి తెలిసిన కూడా… దీనిపైన ఎవరు మాట్లాడలేదని విన్సీ సోనీ అలోషియస్ ఎమోషనల్ అయ్యింది. అయితే ఈ నటి ని వేధించిన ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఆ ఘటన తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నా. నేను తీసుకున్న నిర్ణయం వలన భవిష్యత్‌లో సినిమా అవకాశాలు రాకపోవచ్చు. అయిన ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పదలచుకున్నాను అని పేర్కొంది విన్సీ. ప్రస్తుతం విన్సీ సోని వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.