Tamannaah-Marriage | గతకొన్ని రోజులుగా నటి తమన్నా, విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది. అయితే అది నిజమా? కాదా? వీడియోలో ఉన్నది వాళ్లేనా అనే దానిపై వీరిద్దరూ స్పందించలేదు. దాంతో వీళ్ల రిలేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్లినట్లు మీడియా కంట కూడా పడ్డారు. దాంతో వీళ్ల పెళ్లి త్వరలోనే జరుగుతున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా తాజాగా విజయ్‌వర్మ, సోనాక్షీ సిన్హా నటించిన ‘దాహద్’ సినిమా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే తమన్నా వాటిని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ దాహద్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపింది. అలా తమన్నా పెట్టిందో లేదో.. విజయ్ తమన్నా స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్యూ తమాటర్ అని పోస్ట్ చేశాడు. ఇలా మొత్తానికి వీరిద్ధరూ డేటింగ్లో ఉన్నారని చెప్పకనే చెబుతున్నట్లు పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ వార్తలపై అయినా అటు తమన్నా గానీ, ఇటు విజయ్ గానీ స్పందిస్తాడో లేదో చూడాలి.