Puri Jagannadh – Tabu | టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేతులు కలిపాడు.
‘పూరి కనెక్ట్స్’ ఈ సినిమాను నిర్మించనుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రలో టబు నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా పోస్ట్ పెట్టింది. టబు ఇందులో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
She’s electric.
She’s explosive .
She’s THE TABU.Proudly welcoming THE GEM OF INDIAN CINEMA, Actress #Tabu on-board for a ROLE as DYNAMIC as her presence in #PuriSethupathi ❤️🔥
A #PuriJagannadh Film
Starring Makkalselvan @VijaySethuOfflProduced by Puri Jagannadh,… pic.twitter.com/WGp0kkuZDl
— Puri Connects (@PuriConnects) April 10, 2025