Suhasini| ఒకప్పటి అందాల నటి సుహాసిని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకున్న సుహాసిని ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే సుహాసిని తాను చదువుకునే రోజుల్లో బ్యాంక్ మేనేజర్ కావానలని అనుకునేదట. ఆమె నాన్నేమో తనని ఇంజినీర్‌గానో, కలెక్టర్‌గానో చూడాలనుకున్నారు. అమ్మ తనని ఇంగ్లిష్ లెక్చరర్ చేయాలనుకునేది. కానీ అవేవీ కాకుండా.. బాబాయ్ ప్రోత్సాహంతో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరిన ఆమె తర్వాత నటిగా మారింది.స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా పలువురు హీరోయిన్స్‌తో ఇప్పటికీ మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంటుంది సుహాసిని. అయితే సుహాసని చూడడానికి చాలా అందంగా, పద్దతిగా కనిపిస్తూ అందరి మనసులు దోచుకుంటుంది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలరిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాసిని ఆసక్తికర విషయాలు వెల్లడించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ‘నాకు టీబీ సమస్య ఉంది. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారను. ఎవరికి ఈ విషయం తెలియకుండా ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నా అని సుహాసిని తెలిపింది.
ఇక కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని, అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నట్టు సుహాసిని పేర్కొంది. అయితే ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే సుహాసినికి టీబీ ఉన్న విషయం బయటపడిందట. కొన్నాళ్లకి అంతా సెట్ అయిన 36 ఏళ్ల వయసులో మళ్లీ టీబీ తిరగబెట్టిందట. ఈ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం జరిగిందట. అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలయ్యిందట. అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా సమస్య తగ్గుముఖం పట్టిందని సుహాసిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుహాసిని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.