Sana Makbul | హీరోయిన్ సనా మక్బూల్ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం నటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ట్రెండింగ్‌గా మారింది. తాను ఐదేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నానని సనా పేర్కొంది. ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం వెల్లడించింది. తాను ఆటో ఇమ్యూన్ హైపటైటిస్తో బాధపడుతున్నట్లు పేర్కొంది. 2020 సంవత్సరంలో ఈ వ్యాధి బయటపడిందని.. దాని కారణంగా మాంసహారం మానేసి.. శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఈ వ్యాధి గురించి పలువురు ఆరా తీస్తున్నారు. అయితే, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..!
హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో కణాలు అవయవాలపై దాడి చేస్తాయి. కణాలు కాలేయంపై దాడి చేసిన సమయంలో ఆటో ఇమ్యూన్ హైపటైటిస్ సంభవిస్తుంది. ఆటో ఇమ్యూన్ కారణం కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వ్యాధి టైప్-1 ఏ వయసు వ్యక్తుల్లోనైనా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. టీనేజర్ల నుంచి యువకుల వరకు వ్యాధి వస్తుంది. టైప్-1 మగవారి కంటే ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. ఏఐహెచ్ టైప్-2 రెండేళ్ల నుంచి 14 సంవత్సరాల వయసుగల బాలికలు ప్రభావితమవుతారు.
ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ లక్షణాలు రోగి రోగికి మారుతూ వస్తుంటాయి. ముఖ్యంగా అలసట, కడుపు నొప్పి, కళ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం, కాలేయం విస్తరించడం, చర్మంపై ఎర్రటి మచ్చలు, కీళ్ల నొప్పి, ఋతుస్రావ సమయంలో సమస్యలు కనిపిస్తాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ.. వైరస్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధి కారక జీవులపై దాడి చేయడం బదులుగా.. కాలేయంపై దాడి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ చేసే ఈ దాడి కారణంగా కాలేయంలో వాపు, కాలేయ కణాలకు తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యాధికి ఎందుకు వస్తుందో ఇంకా ఖచ్చితమైన కారణాలు తెలియదు. కానీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నియంత్రించే జన్యువుల పరస్పర చర్య, వైరస్లు పలు కారణాలతో ఆటో ఇమ్యూన్ హైపటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
సనా మక్బూల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో నటించింది. 2014లో వచ్చిన ఈ సినిమాలో సంహిత పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2017లో మా ఓ చందమామ చిత్రంలో బుజ్జమ్మగా పాత్రలో మెరిసింది. తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తమిళంలో ఒకటి, హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తున్నది. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంటున్నది. సనా ఆటో ఇమ్యూన్ వ్యాధిన బారినపడిందన్న వార్త వైరల్‌గా మారింది. వ్యాధి కారణంగా స్టెరాయిడ్స్, పలు మెడిసిన్స్ తీసుకున్నానని.. జీవనశైలిలో మార్పుల కారణంగా వ్యాధి వచ్చిందని భావిస్తున్నానని పేర్కొంది. తన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని.. వ్యాధి నయం అవుతుందా? లేదా? అన్నది తెలియదని వాపోయింది. గతంలో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత సైతం మయోసైటిస్ బారినపడ్డ విషయం తెలిసిందే. ఆమె కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు.
Sneha| నటి స్నేహాకి వింత వ్యాధి.. సీక్రెట్ బయట పెట్టిన భర్త